రేవంత్ ఇళ్ళలో సోదాలకు, మా పార్టీకి సంబంధం లేదు: టీఆర్ఎస్
- సోదాలు జరుపుతున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థలు
- ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారు
- రేవంత్ రెడ్డి డ్రామాలు అందరికీ తెలిసినవే
ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని... టీఆర్ఎస్ పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రామాలు అందరికీ తెలిసినవే అని ఎద్దేవా చేశారు. నేర చరిత్ర కలిగిన వారు ఏ పార్టీలో ఉన్నా చర్యలు తప్పవని చెప్పారు. ఈరోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.