పీకల్లోతు ప్రేమలో విజయ్ దేవరకొండ.. విజయ్ ప్రేయసి ఫొటోలు ఇవిగో!
- బెల్జియం అమ్మాయి మిలానే తో విజయ్ ప్రేమాయణం
- హైదరాబాదులో మెడిటేషన్ క్లాసులు తీసుకుంటున్న మిలానే
- తల్లిదండ్రులతో కలసి డిన్నర్ చేస్తున్న ప్రేమజంట
తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని ఇటీవలే విజయ్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో విజయ్ తో కలసి ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బెల్జియం దేశానికి చెందిన ఓ ముద్దుగుమ్మను విజయ్ లవ్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫొటోలు చూస్తుంటే... లవ్ మ్యాటర్ చాలా సీరియస్ గానే ఉన్నట్టు అర్థమవుతోంది. విజయ్ ప్రియురాలి పేరు మిలానే. హైదరాబాదులో ఆమె మెడిటేషన్ క్లాసులు తీసుకుంటోందట. ఇక్కడే వారికి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. ఇద్దరి తల్లిదండ్రులతో పాటు ప్రేమజంట డిన్నర్ చేస్తున్న ఫొటోలు... వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే, ఈ ఫొటోలపై విజయ్ ఇంత వరకు స్పందించలేదు.