ధోనీ ఉంటే ప్రతి ఒక్కరికీ ధైర్యం ఉంటుంది: రాయుడు
- యోయో పరీక్ష పాసైన రాయుడు
- ఈ సీజన్‌లో రాణించేందుకు ధోని సాయం చేశాడు
- మిడిలార్డర్‌పై దృష్టి పెట్టి ఒత్తిడి పెంచుకోలేను
ధోనీ ఉంటే ప్రతి ఒక్కరికీ అండ దొరికిందనే ధైర్యం ఉంటుందని.. తనకు కూడా ఈ సీజన్‌లో రాణించేందుకు అతడే సాయం చేశాడని రాయుడు తెలిపాడు. ఆసియా కప్ టోర్నీ అనేది తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు దొరికిన మంచి అవకాశమని.. మిడిలార్డర్‌పై దృష్టి పెట్టి తనపై ఒత్తిడి పెంచుకోలేనన్నాడు. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమవడం నిరుత్సాహాన్ని కలుగ జేసిందని.. తిరిగి ఆసియా కప్‌కు ఎంపిక కావడం సంతోషాన్నిచ్చిందని అంబటి రాయుడు చెప్పాడు.