fasak: ‘ఫసక్’ ట్రెండింగ్ పై ప్రశ్నించిన నటి.. పెదరాయుడు డైలాగ్ కొట్టిన మంచు మనోజ్!

షార్ట్స్‌లో చూడండి
ఇండియాటుడే ఛానల్ కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ‘ఫసక్’ అన్న పదాన్ని వాడిన సంగతి తెలిసిందే. ఈ పదం ఎంత పాప్యులర్ అయిపోయిందంటే దీనికి పేరడీగా వేలాది వీడియోలు తయారయ్యాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇది ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ దీనిపై స్పందించింది. ‘ఈ ఫసక్ ఏంటి? ఇలాంటి పదాన్ని నేనెప్పుడూ వినలేదు. ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.

దీన్ని గమనించిన మనోజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘చాలా భావోద్వేగాలతో కూడిన రియాక్షనే ఫసక్. నా ఇంగ్లిష్ తప్పయితే క్షమించు.. పూర్తిగా అర్థమే లేదనుకుంటే దండించు.. ఫసక్‌’ అంటూ పెదరాయుడు సినిమాలోని డైలాగ్ ను పేరడీ చేసి ట్వీట్ చేశాడు. దీనిపై ట్విట్టర్ లో జోకులమీద జోకులు పేలుతున్నాయి. మనోజ్‌కు రిప్లై ఇచ్చిన నిధి ‘మనోజ్.. ఇప్పుడు నేను ఫసక్‌ ఎమోషన్‌తో పూర్తిగా కనెక్ట్ అయ్యాను’ అంటూ కామెంట్‌ చేసింది.
Go Back to Shorts
fasak
mohan babau
manchu manoj
nidhi agarwal
Tollywood
cinema

More Telugu News