మామను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయించబోయి.. అడ్డంగా బుక్కయిన అల్లుడు!
- తెలంగాణలోని సిద్దిపేటలో ఘటన
- మామ కారు కింద మత్తుపదార్థం
- అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
సిద్దిపేటలోని గణేశ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను హైదరాబాద్ లోని ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. కొన్నిరోజుల క్రితం మామాఅలుళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మామను జైలుకు పంపాలని పథకం పన్నిన అల్లుడు ఆయన ఇంట్లోని కారు కింద 3 కేజీల నిషేధిత అల్ఫాజోలం పెట్టాడు. అనంతరం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయమై కూపీలాగగా, అల్లుడు దొరికిపోయాడు. దీంతో సదరు ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? తదితర అంశాలపై అతడిని విచారిస్తున్నారు.