Jagan: 'ఎన్టీఆర్' సినిమాలో వెన్నుపోటు ఉంటుందా? లేదా?: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఎన్టీఆర్' సినిమాలో దివంగత ఎన్టీఆర్ ను చంద్రబాబు వంచించిన వైనాన్ని, వెన్నుపోటు ఎలా పొడిచారనే విషయాన్ని చూపిస్తున్నారా? లేదా? అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తమ అధినేత జగన్ అంటే... టీడీపీ పాలనను అంతం చేయడం అని చెప్పారు. జగన్ అంటే ప్రేమ, కరుణ, ఐక్యత, బాధ్యత, దార్శనికత, పురోగతి, సానుభూతి అని అన్నారు. ఘోర వైఫల్యాలతో టీడీపీ నైరాశ్యంలో కూరుకుపోయిందని చెప్పారు.

జగన్ పై ట్విట్టర్ వేదికగా టీడీపీ నిందారోపణలు చేయడం దారుణమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రజల మనసుల్లో జగన్ కు ఉన్న స్థానాన్ని టీడీపీ నేతలు గుర్తించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచి చూడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తున్నామని, జగన్ ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు. 
Go Back to Shorts
Jagan
Chandrababu
vijayasai reddy
Telugudesam
YSRCP

More Telugu News