రుణాలపై వడ్డీ రేట్లను పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
- 0.2 శాతం మేరకు పెరిగిన వడ్డీ
- భారం కానున్న గృహ, వాహన రుణాలు
- తక్షణమే అమలులోకి రానున్న పెంచిన వడ్డీ
కాగా, గత సంవత్సరం ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో సమావేశమైన రిజర్వ్ బ్యాంక్, తన ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచగా, ఆ ప్రభావం బ్యాంకు ఆదాయంపై చూపుతుండటంతో, నష్ట నివారణ నిమిత్తమే బ్యాంకు వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.