చిత్రపరిశ్రమలో అనుకోనివి అనేకం జరుగుతుంటాయి: తమన్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిత్రపరిశ్రమలో అనుకోనివి అనేకం జరుగుతుంటాయి: తమన్నా

  • సుదీర్ఘమైన కెరియర్ ను చూశాను 
  • ఆశలు పెట్టుకున్న సినిమాలు ఆడలేదు
  • అంచనాలు లేనివి హిట్ కొట్టాయి
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో తమన్నా ఒకరు. ఒకప్పుడు ఎడా పెడా వరుస సినిమాలు చేసిన తమన్నా చేతిలో ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు మాత్రమే వున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "చిత్రపరిశ్రమలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి టైమ్ కలిసి రావాలి. ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలిననే చెప్పాలి. చాలా తక్కువ సమయంలోనే నేను ఇక్కడ నిలదొక్కుకోగలిగాను.

12 యేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాను. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు ఆడని సందర్భాలు వున్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా చేసిన సినిమాలు ఘన విజయాలను సాధించాయి. హిందీలో నేను చేసిన సినిమాలు నాకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. తెలుగులో చేసిన 'బాహుబలి' హిందీలోకి వెళ్లడం వలన నాకు అక్కడ మంచి క్రేజ్ వచ్చింది. అనుకున్నవి జరగకపోవడం .. అనుకోనివి జరిగిపోవడం ఇక్కడ ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తుంటాయి" అని చెప్పుకొచ్చింది.
tamannah

More Telugu News