‘సైరా’ సెట్ లో అమితాబ్ తో ‘మెగా’ హీరోలు.. చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన అరుదైన ఫొటో!
Add ap7am to your home Screen

‘సైరా’ సెట్ లో అమితాబ్ తో ‘మెగా’ హీరోలు.. చాలా రోజుల తర్వాత బయటకొచ్చిన అరుదైన ఫొటో!

  • ‘సైరా’లోని తమ పాత్రల గెటప్ లలో బిగ్ బీ, చిరంజీవి 
  • ఆ ఫొటోలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్
  • తాజాగా ఫొటో పోస్ట్ చేసిన సత్యానంద్ 
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ‘మెగాస్టార్’ తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ‘సైరా’లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా నటిస్తున్నాడనే వార్తలతో ‘మెగా’ అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. ఆ వార్తలు ఎంత వరకు వాస్తవమనే విషయాన్ని పక్కనపెడితే.. తాజాగా, ‘సైరా’ సెట్ కు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రముఖ రచయిత సత్యానంద్ ఉన్నారు. ‘సైరా’లో తాము పోషించే పాత్రల గెటప్ లలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి ఉండటం గమనార్హం.

అయితే, సుమారు రెండుమూడు నెలల క్రితం దిగిన ఈ ఫొటో ఇప్పుడు బయటకు రావడానికి కారణం ప్రముఖ సినీ రచయిత సత్యానంద్. చిరంజీవి నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన సత్యానంద్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో అమితాబ్, ‘మెగా’ హీరోలతో పాటు సత్యానంద్ కూడా ఉన్నారు. ‘సైరా’ సెట్ లో దిగిన ఈ ఫొటోను ఫ్రేమ్ చేయించి మరీ, సత్యానంద్ కు చిరంజీవి పంపారట. ఇన్ని రోజుల తర్వాత ఆ ఫొటోను సత్యానంద్ పోస్ట్ చేయడంతో దాన్ని చూసిన ‘మెగా’ అభిమానులు సంబరపడిపోతూ, దీనిని వైరల్  చేస్తున్నారు. 
syra
Chiranjeevi
Pawan Kalyan

More Telugu News