జనసేన ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్!
- సెప్టెంబర్ 12 నుంచి ఎన్నికల ప్రచారం
- విజన్ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ప్యాక్ కు పవన్ ఆదేశం
- గ్రామ స్థాయి వరకు కేడర్ ను సన్నద్ధం చేయాలంటూ సూచన
సెప్టెంబర్ 12 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. ఈ ప్రచారాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలని మార్గనిర్దేశం చేశారు. ప్రచారం కోసం ఉపయోగించుకోవాల్సిన మాధ్యమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గ్రామ స్థాయి వరకు కేడర్ ను సర్వ సన్నద్ధం చేయాలని శ్రేణులకు సూచించారు.