దాసరి నారాయణరావుగారితో పనిపడింది.. తప్పక వెళ్లాను!: సుప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాసరి నారాయణరావుగారితో పనిపడింది.. తప్పక వెళ్లాను!: సుప్రియ

  • వ్యవహారాల్లో చాలా స్ట్రిక్టుగా వుండేదాన్ని   
  • తెలియక అలా జరిగివుంటుంది
  • ఆయన దగ్గరికే వెళ్లవలసి వచ్చింది
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న సుప్రియ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సమయంలోనే "సుప్రియ వల్లనే అక్కినేని నాగేశ్వరరావుకి .. దాసరి నారాయణ రావుకి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో విన్నాను .. అది ఎంతవరకూ నిజం?" అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. "చిన్నపార్ట్ ప్లే చేశానేమో .. స్టూడియోకి సంబంధించిన పనులు చూసుకోవడానికి నేను వచ్చినప్పుడు నాకు 18 యేళ్లు. స్టూడియో వ్యవహారాలు చాలా స్ట్రిక్ట్ గా వుండాలనే ఉద్దేశంతో, పెద్దవాళ్లు ఎవరనే విషయాన్ని గ్రహించకుండా కాస్త దూకుడు చూపించానేమో. లేదంటే నాకు తెలియని పెద్ద విషయమేదైనా వుందేమో. దాసరి గారు చనిపోవడానికి ఒక ఏడాది ముందు నాకు ఒక ముఖ్యమైన పని పడి ఆయన దగ్గరికి వెళ్లాను. ఎలా అడగాలా అనిపించింది .. వెళ్లి చూద్దాం అనుకుంటూనే వెళ్లాను. రాత్రి 12 గంటలకి వెళ్లిన నేను .. వచ్చినట్టుగా సౌండ్ చేశాను. "వచ్చావా .. ఆ తాతగారికి మనవరాలివి గదా .. ఆ మాత్రం పౌరుషం ఉండాల్లే .. కూర్చో .. ఏం తింటావ్ " అని అడిగారు అంటూ చెప్పుకొచ్చారు.     
dasari
supriya

More Telugu News