‘ఆర్ఎక్స్ 100’ సినిమా బైక్ వేలం.. వివరాలు!
- కేరళ వరదలపై స్పందించిన సినిమా యూనిట్
- కనీస ధర రూ.50,000గా నిర్ణయం
- సాయం చేయాలని కోరిన హీరో కార్తికేయ
ఈ మేరకు హీరో కార్తికేయ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తమ సినిమాలో వాడిన ఆర్ఎక్స్ 100 బైక్ ను వేలం వేస్తున్నామనీ, కనీస ధర రూ.50,000గా నిర్ణయించామనీ కార్తికేయ తెలిపాడు. బైక్ కావాలనుకునే వారు తమ వివరాలను [email protected] కు మెయిల్ చేయాలనీ, లేదంటే 9100445588 నంబర్ కు వాట్సప్ చేయాలని సూచించాడు.