పవన్ కష్టం చూసి నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: సుప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కష్టం చూసి నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: సుప్రియ

  • పవన్ కల్యాణ్ చాలా సిగ్గరి  
  • ఆ సీన్ ను చాలా ధైర్యంగా చేశాడు 
  • ఆయన నాకు మంచి ఫ్రెండ్
చాలాకాలం క్రితం కథానాయికగా సుప్రియ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా చేశారు. ఆ సినిమా సంగతులను ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు. "చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ హీరో కావడం వలన .. నాగేశ్వరరావు మనవరాలిగా నేను హీరోయిన్ ను కావడం వలన, 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాపై అందరిలోను ఆసక్తి ఉండేది.

మా ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం వలన అంతా కొత్తకొత్తగా ఉండేది. పవన్ కల్యాణ్ బాగా సిగ్గరి.. పిలిచి నా పక్కన కూర్చోమన్నా కూర్చునేవాడు కాదు. ఈ సినిమా షూటింగు సమయంలో సమ్మె జరిగినప్పుడు అందరి డేట్లు మారిపోతున్నాయి. ఫస్టు మూవీ కావడంతో పాపం ఆయన చాలా టెన్షన్ పడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన చేతుల మీదుగా వరుసగా కార్లు వెళ్లే సీన్ ను డూప్ షాట్స్ గా తీస్తారనుకున్నాను. కానీ పవన్ చేతుల మీదుగా నిజంగానే కార్లు వెళ్లాయి .. అది చూసి నా కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి. ఇప్పటికీ ఆయన నాకు మంచి స్నేహితుడు" అని చెప్పుకొచ్చారు.   
supriya

More Telugu News