బెల్లంకొండ శ్రీనివాస్ తో జోడీ కట్టేసిన మెహ్రీన్
- హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్
- కథానాయికలుగా కాజల్.. మెహ్రీన్
- హైదరాబాద్ లో జరుగుతోన్న షూటింగ్
'సాక్ష్యం' సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఆల్రెడీ కాజల్ ను తీసుకున్నారు. తాజాగా మెహ్రీన్ ను తీసుకోవడం .. ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కావడం జరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చంద్రబోస్ సాహిత్యం .. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.