నిండు గర్భిణిని ఎయిర్ లిఫ్ట్ చేసిన నేవీ.. ఆసుపత్రిలో పండంటి బిడ్డ జననం!
- వరదల్లో చిక్కుకున్న గర్భిణి
- హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించిన నేవీ సిబ్బంది
- ఆసుపత్రిలో ప్రసవం
రంగంలోకి దిగిన ఆర్మీ, నేవీ అధికారులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణిని గుర్తించిన నేవీ సిబ్బంది వెంటనే ఆమెను ఇంటిపైకి చేర్చి హెలికాప్టర్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మహిళను రక్షించి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆసుపత్రిలో బిడ్డతో కలిపి ఉన్న ఫొటోలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.