nani: యువకుడిగా .. మధ్య వయస్కుడిగా .. వృద్ధుడిగా కనిపించనున్న నాని!

షార్ట్స్‌లో చూడండి
వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ .. నటన పరంగా నాని మరింత పరిణతిని కనబరుస్తూ కెరియర్ ను పరుగులు తీయిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో 'దేవదాస్' సినిమా చేస్తున్నాడు. ఈ మల్టీస్టారర్ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఇక నాని హోస్ట్ గా చేస్తోన్న 'బిగ్ బాస్ 2' కూడా ముగింపు దశకి చేరుకుంటోంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాగానే నాని .. తన తదుపరి చిత్రంగా 'జెర్సీ'ని మొదలుపెట్టనున్నాడు.

క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. యువకుడిగా .. మధ్య వయస్కుడిగా .. వృద్ధుడిగా ఆయన మూడు దశలలో తెరపై కనిపించనున్నాడని అంటున్నారు. నటనకి మంచి స్కోప్ ఉండటంతో నాని ఈ సినిమాపై ఎంతో ఆసక్తితో .. మరెంతో ఉత్సాహంతో వున్నాడని చెబుతున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించే ఈ సినిమాకి, గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.  
Go Back to Shorts
nani
gautham thinnanuri

More Telugu News