'సాహో' కోసం రొమేనియాకి ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' కోసం రొమేనియాకి ప్రభాస్

  • యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో'
  • దుబాయ్ లో మేజర్ షెడ్యూల్ పూర్తి 
  • కొనసాగుతోన్న హైదరాబాద్ షెడ్యూల్
ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమాపైనే వుంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే దుబాయ్ లో మేజర్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరుపుతున్నారు. హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు కొనసాగుతోంది.

ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ ను 'రొమేనియా'లో ప్లాన్ చేశారు. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు .. ఒకటి రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుందని అంటున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ ప్రేక్షకులను కూడా ఈ సినిమా పలకరించనుంది.       
prabhas
shraddha kapoor

More Telugu News