'కేరాఫ్ కంచరపాలెం' సినిమా పట్ల ఆసక్తితో వున్న రానా
- తెరపైకి మరో విభిన్న ప్రేమకథ
- ఆగస్టు 15వ తేదీన ట్రైలర్ రిలీజ్
- సెప్టెంబర్ 7న సినిమా విడుదల
వయసు ఎంత అంటే .. ఒక సంఖ్య మాత్రమే .. ప్రేమకి దానితో పనిలేదు అనే కంటెంట్ తో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 15వ తేదీన ట్రైలర్ ను, సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని తాజాగా రానా ట్వీట్ చేశాడు. సమర్పకుడిగా ఈ సినిమా తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందని రానా భావిస్తున్నాడు. సహజత్వానికి చాలా దగ్గరగా అనిపించే ఈ సినిమా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడం ఖాయమనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు.