హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్!
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం
- పలు మార్గాల్లో రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు
- బంజారాహిల్స్ లో నిలిచిపోయిన వాహనాలు
కాగా, ఈరోజు మధ్యాహ్నం కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. పఠాన్ చెరువు, శేరిలింగంపల్లి, మియాపూర్, బోయినపల్లి, చందానగర్, ఉప్పల్, చార్మినార్ తో పాటు పలు శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీగా వరదనీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో, జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్స్ ను రంగంలోకి దింపింది.