aniruth: 'జెర్సీ' మూవీ కోసం భారీగా డిమాండ్ చేసిన అనిరుథ్

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి డిమాండ్ వున్న సంగీత దర్శకుడు అనిరుథ్. వరుసగా అక్కడ ఆయన స్టార్ హీరోల సినిమాలకి పనిచేస్తూ వెళుతున్నాడు. ఆయన సంగీతానికి అక్కడి యూత్ లోను .. మాస్ లోను మంచి ఆదరణ వుంది. అందువలన ఆయన మార్కెట్ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో 'జెర్సీ' సినిమా కోసం ఆయనను ఎంపిక చేసుకున్నారు.

 నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అందువలన సంగీతంలో కొత్తదనం కోసం అనిరుథ్ ను తీసుకున్నారు. అయితే ఆయన 1కోటి 20 లక్షల రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేశాడట. దర్శక నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో 80 లక్షలకి చేయడానికి ఆయన అంగీకరించినట్టుగా చెబుతున్నారు. 'అజ్ఞాతవాసి' సినిమా పరాజయం పాలైనా సంగీతం పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తరువాత అనిరుథ్ ఒప్పుకున్న సినిమా 'జెర్సీ'నే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.  
Go Back to Shorts
aniruth
nani

More Telugu News