ఏపీలో 4 రోజులు ఉంటే .. హైదరాబాద్ లో 40 రోజులు ఉంటాడు: పవన్ పై కేశినేని ఫైర్
- రైతుల సమస్యలపై పవన్ కు అవగాహన లేదని విమర్శ
- ఏపీని మోసం చేసిన మోదీపై పోరాడాలని సూచన
- బాబుపై బీజేపీ కుట్రలో కేసీఆర్, గవర్నర్ భాగస్వాములని ఆరోపణ
పవన్ కల్యాణ్ నిజంగా సీరియస్ రాజకీయ నాయకుడు కాదనీ, ఆయన మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు లక్ష్యంగా బీజేపీ పన్నిన కుట్రలో కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లు భాగస్వాములయ్యారని ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని తొలుత చెప్పిన కేంద్రం ఇప్పుడు జోన్ అసాధ్యమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమన్నారు.