'దటీజ్ మహాలక్ష్మి'గా తమన్నా వచ్చేది అప్పుడే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దటీజ్ మహాలక్ష్మి'గా తమన్నా వచ్చేది అప్పుడే!

  • హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్'
  • కన్నడలో 'బట్టర్ ఫ్లై'
  • తమిళంలో 'పారిస్ పారిస్'
హిందీలో కొంతకాలం క్రితం వచ్చిన 'క్వీన్' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళవెర్షన్ 'పారిస్ పారిస్' పేరుతో రూపొందుతూ ఉండగా, ప్రధానమైన పాత్రను కాజల్ చేస్తోంది. ఇక కన్నడ వెర్షన్ 'బట్టర్ ఫ్లై' పేరుతో నిర్మితమవుతూ ఉండగా, ప్రధానమైన పాత్రలో పరుల్ యాదవ్ చేస్తోంది.

ఇక తెలుగు వెర్షన్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, తమన్నా ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకి 'దటీజ్ మహాలక్ష్మి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొన్ని రోజులుగా యూరప్ లో జరుపుతూ వచ్చిన చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తయింది. అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, అక్టోబర్లో విడుదల చేయనున్నారు. తెలుగులోనూ ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూడాలి.  
tamannah

More Telugu News