nani: నాని సినిమా కోసం రంగంలోకి అనిరుథ్

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో బిజీగా వున్న సంగీత దర్శకులలో అనిరుథ్ ఒకరు. అక్కడి హీరోలు .. వాళ్లకి గల క్రేజ్ .. వాళ్ల అభిమానుల టేస్ట్ ను దృష్టిలో పెట్టుకుని అనిరుథ్ సాంగ్స్ ను కంపోజ్ చేస్తాడని అంటారు. ఆయన సంగీతం అంటే అక్కడి కుర్రకారు ఎంతగానో ఇష్టపడతారు. అలాంటి అనిరుథ్ ను .. 'అజ్ఞాతవాసి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు త్రివిక్రమ్ పరిచయం చేశాడు.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, ఆ తరువాత ఆయనకి ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో తమిళ సినిమాలనే చేసుకుంటూ వెళుతోన్న అనిరుథ్ కు .. 'జెర్సీ' సినిమా నుంచి ఛాన్స్ వెళ్లింది. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ అయితే బాగుంటుందని భావించి ఆయనను సంప్రదిస్తే .. ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.    
Go Back to Shorts
nani
aniruth

More Telugu News