అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్ ఫెక్ట్ కావాలనే ఉంది కానీ..!:అనుష్క తల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్ ఫెక్ట్ కావాలనే ఉంది కానీ..!:అనుష్క తల్లి

  • ప్రభాస్-అనుష్కల పెళ్లి వదంతులపై స్వీటీ తల్లి
  • వాళ్లిద్దరూ స్టార్స్.. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు
  • ఇకనైనా ఈ వదంతులు ఆపండి
టాలీవుడ్ నటీనటులు ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులపై వాళ్లిద్దరూ స్వయంగా స్పందించినప్పటికీ ఆ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వదంతులపై అనుష్క తల్లి స్పందిస్తూ.. వాళ్లిద్దరూ స్టార్స్ అని, వీరి కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయని అన్నారు. అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్ ఫెక్ట్ కావాలనే ఉంది కానీ, వాళ్లిద్దరూ మంచి స్నేహితులని అన్నారు. ఇకనైనా వారి పెళ్లి గురించి వస్తున్న వదంతులను ఆపాలని ఆమె కోరారు. కాగా, ప్రస్తుతం ‘సాహో’ చిత్రం షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. 
anushka
prabhas

More Telugu News