సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హైదరాబాదులో ఇల్లు కొన్న హీరోయిన్ 
  • త్వరలో చిరంజీవి ద్విపాత్రాభినయం! 
  • హీరోగా మారిన మరో కమేడియన్
  • వచ్చే నెల నుంచి నితిన్ 'భీష్మ' 
*   మిగతా హీరోయిన్ల మాదిరే అందాలతార కేథరిన్ త్రెసా కూడా హైదరాబాదులో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. నగర శివారు కోకాపేటలో ఓ డూప్లెక్స్ ఇంటిని ఈ చిన్నది తాజాగా కొన్నట్టు సమాచారం.  
*  ప్రస్తుతం చేస్తున్న 'సైరా' చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఇందులో చిరంజీవి రెండు పాత్రల్లో నటించనున్నారు.
*  గతంలో పలు చిత్రాలలో నటించిన ప్రముఖ హాస్య నటుడు సత్యం రాజేష్ కూడా తాజాగా హీరోగా మారాడు. 'గీతాంజలి' ఫేం రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న 'విశ్వామిత్ర' చిత్రంలో రాజేష్ హీరోగా ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో నందితా రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది.  
*  నితిన్ హీరోగా రూపొందే 'భీష్మ' చిత్రం షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుంచి జరుగుతుంది. 'ఛలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.
Catherin
Chiranjivi
Koratala Siva
Nithin

More Telugu News