ఇంత వెరైటీయా?... భారీ పంజరంలో ఎగురుతూ పెళ్లి మండపానికి వచ్చిన వధూవరులు... వీడియో!
- వెరైటీగా వివాహ మండపానికి వచ్చిన వధూవరులు
- విద్యుత్ పంజరంలో వారిని తీసుకువచ్చిన గద్ద
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి ఓ విద్యుత్ పంజరంలో వారిద్దరూ వచ్చారు. ఆకాశం నుంచి వారిద్దరినీ ఓ గద్ద తీసుకువస్తున్నట్టుగా ఓ క్రేన్ సాయంతో వారిని కిందకి దించారు. ఆ సమయంలో పంజరం నుంచి వెలుగులు విరజిమ్మాయి. ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేయగా, వారి ఎంట్రీకి వధూవరులు 'వహ్... ఏం వెరైటీ' అంటున్నారు. వారు దిగుతున్న సమయంలో "బహారో ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయాహై..." పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండటం ఈ వీడియోకు మరింత అందాన్ని తెచ్చింది. దాన్నోసారి మీరూ చూసేయండి.