nani: కథను తయారుచేసే పనిలో ఇంద్రగంటి .. హీరోగా నాని

షార్ట్స్‌లో చూడండి
నాని .. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'అష్టా చమ్మా' .. 'జెంటిల్ మేన్' ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. త్వరలో ఈ ఇద్దరూ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లనున్నారనేది తాజా సమాచారం. ఇటీవలే ఇంద్రగంటి మోహనకృష్ణ .. సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం' సినిమా చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

 దాంతో ఆయన తన తదుపరి సినిమాను నానితో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆల్రెడీ రెండు హిట్స్ ఇచ్చిన కారణంగా ఆయనతో చేయడానికి నాని కూడా సుముఖతను వ్యక్తం చేశాడట. దాంతో వైవిధ్యభరితమైన కథను సిద్ధం చేసుకునే పనిలో ఇంద్రగంటి నిమగ్నమై వున్నాడని అంటున్నారు. ప్రస్తుతం నాని కమిటైన సినిమాలను పూర్తి చేయవలసి వుంది. అందువలన ఈ ప్రాజెక్టును ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కించాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.   
Go Back to Shorts
nani
indraganti

More Telugu News