Nara Lokesh: ఎన్నికలకు సమాయత్తం.. ఏపీలో నారా లోకేశ్ విస్తృత పర్యటనలు?

షార్ట్స్‌లో చూడండి
సార్వత్రిక ఎన్నికలు సమీపించనుండటంతో టీడీపీలో ఎన్నికల కోలాహలం అప్పుడే మొదలైంది. రానున్న ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టి సారించగా, యువనేత నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటించి, జిల్లాల వారీగా పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించనున్నారు.

 వారంలో మూడు రోజులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని లోకేశ్ భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర పర్యటన ద్వారా జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లను సరిదిద్దనున్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లో లోకేశ్ తొలి విడత పర్యటన పూర్తి చేసుకోవాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. కాగా, ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చేస్తున్న ధర్మపోరాట సభలను ఇకపై నెలకు ఒకట్రెండు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 
Go Back to Shorts
Nara Lokesh
elections

More Telugu News