Nara Lokesh: లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవగలరనే నమ్మకం చంద్రబాబుకి లేదు: పవన్ కల్యాణ్
తన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవగలరనే నమ్మకం ఏపీ సీఎం చంద్రబాబుకి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ... సినీనటుడికి ఏం తెలుసని తనను కొందరు విమర్శిస్తున్నారని, తాను ఏ విధానంపై అయినా మాట్లాడడానికి సిద్ధమని అన్నారు. తాను అన్ని విషయాలను చదువుకునే రాజకీయాల్లోకి వచ్చానని, విధానాలపై చర్చించేందుకు చంద్రబాబు, లోకేశ్, జగన్ రావాలని, తాను కొందరిలా ఐఏఎస్‌లపై ఆధారపడే వాడిని కాదని అన్నారు.
బలమైన సర్కారుని ఏర్పాటు చేయడమే జనసేన లక్ష్యమని, బలమైన భావజాలంతో జనసేన పార్టీ స్థాపించానని పవన్ కల్యాణ్ చెప్పారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారని పేదల పరిస్థితులు మాత్రం మారట్లేదని తెలిపారు. ప్రజల సమస్యలపై మాట్లాడే పార్టీ జనసేన అని అన్నారు.