prabhas: ప్రభాస్ .. రానా హీరోలుగా మరో మల్టీ స్టారర్?

షార్ట్స్‌లో చూడండి
'బాహుబలి' తెలుగు సినిమా భారీతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాదు .. మల్టీ స్టారర్ మూవీస్ మరిన్ని రూపొందడానికి కారణమైంది. 'బాహుబలి'తో వచ్చిన భారీ క్రేజ్ తో ఒక వైపున ప్రభాస్ .. మరో వైపున రానా తమ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. 'సంతోషం' .. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాల పేర్లు వినగానే దర్శకుడు దశరథ్ పేరు గుర్తుకు వస్తుంది. లవ్ .. ఫ్యామిలీ డ్రామాతో కూడిన అద్భుతమైన కథలను తయారు చేసుకోవడంలో ఆయనకి ఎంతో నైపుణ్యం వుంది. అలాంటి దశరథ్ .. ఒక మల్టీ స్టారర్ మూవీ కోసం కథను సిద్ధం చేసుకున్నాడట. ఆ కథలోని ప్రధాన పాత్రల్లో ప్రభాస్ .. రానా అయితే కరెక్టుగా ఇమిడిపోతారని భావించిన ఆయన, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడని అంటున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో .. ఎప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో చూడాలి.       
Go Back to Shorts
prabhas
rana

More Telugu News