Telangana: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

షార్ట్స్‌లో చూడండి
వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు సహా ఒడిశా, గోవా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, గుజరాత్, కర్ణాటకలో వచ్చే శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే వారం రోజుల పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కాగా, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కాసేపట్లో తూర్పు గోదావరి జిల్లా కొత్త పల్లె, పెదపూడి, సామర్లకోట, పెద్దాపురంలో పిడుగులు పడే అవకాశం ఉంది.           
Go Back to Shorts
Telangana
Andhra Pradesh
rain

More Telugu News