Andhra Pradesh: ఏపీకి ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ.. భారీగా ఉద్యోగాలు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో మరో కంపెనీ ఏర్పాటు కానుంది. సెమీ కండక్టర్ల తయారీలో పేరు గాంచిన ఇన్వెకాస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన భారీగా జరగనుంది. ఇటీవల అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇన్వెకాస్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని, ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఇన్వెకాస్ ప్రతినిధులు ఇందుకు అంగీకరించారు. శుక్రవారం మంత్రి లోకేశ్‌తో ఇన్వెకాస్ ప్రతినిధులు సమావేశమై సెమీ కండక్టర్ పార్క్ గురించి చర్చించనున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Nara Lokesh
Simiconductors

More Telugu News