సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'యూ టర్న్' పూర్తి చేసిన సమంత
  • నాగశౌర్యకు బాలయ్య టైటిల్ 
  • విలన్ పాత్రలో 'రోజా' నాయిక 
*  ఇటీవలి కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకున్న చెన్నయ్ బ్యూటీ సమంత తాజాగా 'యూ టర్న్' చిత్రం షూటింగును పూర్తిచేసింది. వచ్చే వారం నుంచి ఈ చిత్రానికి డబ్బింగ్ చెబుతుంది. కన్నడలో హిట్టయిన 'యూ టర్న్' చిత్రం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  గతంలో బాలకృష్ణ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడీ టైటిల్ని తాజాగా యంగ్ హీరో నాగశౌర్య చిత్రానికి నిర్ణయించనున్నారు. నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ఈ టైటిల్ని పరిశీలిస్తున్నారట.
*  రోజా, అల్లరిప్రియుడు, జంటిల్మెన్ వంటి చిత్రాల ద్వారా అలరించిన కథానాయిక మధుబాల తాజాగా విలన్ పాత్రలో నటించనుంది. బాబీ సింహా హీరోగా తమిళంలో రూపొందుతున్న 'అగ్నిదేవ' చిత్రంలో మధుబాల విలన్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం.
Samantha
Balakrishna
Nagashourya
Madhubala

More Telugu News