బిగ్ బాస్ ఎలిమినేషన్ లో తర్వాత నిష్క్రమించేది బాబు గోగినేని!: సినీ నటి అర్చన

  • ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆయనే 
  • మరో ఐదుగురు క్యూలో ఉన్నారు
  • హోస్ట్ గా నాని బాగా చేస్తున్నాడు
బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది. హేతువాది బాబు గోగినేని నిష్క్రమిస్తారని జోస్యం చెప్పింది. మరో ఐదుగురు కూడా క్యూలో ఉన్నారని... వారి పేర్లను బయటపెట్టలేనని తెలిపింది.

హోస్ట్ గా నాని పర్ఫామెన్స్ బాగుందని చెప్పింది. అయితే, తారక్ గొప్పగా చేశాడని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఇష్టమైనవారు ఉన్నారని.... వాళ్లను సేవ్ చేయడానికి చివర్లో వారి పేర్లను బయటపెడతానని చెప్పింది.
Go Back to Shorts
bigboss
nani
tarak
babu gogineni

More Telugu News