ట్రంప్ తదుపరి లక్ష్యం ఈబీ5 ఇన్వెస్టర్ వీసాలే!... వాటి సంస్కరణ కోసం పట్టు
- ఈబీ5 వీసాలను సంస్కరించాలని అమెరికా కాంగ్రెస్ ను కోరిన ట్రంప్
- లేదంటే వీటిని రద్దు చేయాలని డిమాండ్
- ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు
ఇక అమెరికా చట్టసభ సభ్యుల్లోనూ కొందరు ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇవి దుర్వినియోగం అవుతున్నాయన్న వార్తలతో ఏకీభవిస్తూ వీటి జారీని వ్యతిరేకిస్తున్నారు. ఈబీ5 రీజినల్ సెంటర్ ప్రొగ్రామ్ ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇన్వెస్టర్లను, వ్యాపారులను మోసాల నుంచి కాపాడుకునేందుకు ఈబీ5 వీసాలను సంస్కరించాల్సి ఉందిని అమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా పేర్కొన్నారు.