జగన్‌కే తన మద్దతని పవన్ కల్యాణ్ నాకు చెప్పారు: వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ కీలక వ్యాఖ్య
- వ్యక్తిగతంగా బాగా శ్రమిస్తోన్న వ్యక్తి జగన్
- వైసీపీతో పవన్ కలిసేందుకు ప్రయత్నం చేసింది నిజమే
- చంద్రబాబు చేసే అవినీతి పవన్‌కు నచ్చలేదు
- 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడానికి పవన్ సిద్ధం
2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడానికి పవన్ సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. 2014లో తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని, అయితే ఏపీ సర్కారు ప్రజలకు ఏం చేయలేదని పవన్ అన్నారని ఆయన తెలిపారు. అనుభవజ్ఞుడని మద్దతిస్తే ఈ నాలుగేళ్లలో ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదని పవన్ అన్నారని వరప్రసాద్ తెలిపారు.