ఈ ఫేక్‌ మీడియా కేవలం చెత్త ఫొటోలను మాత్రమే ప్రచురించింది: ట్రంప్‌
Add ap7am to your home Screen

ఈ ఫేక్‌ మీడియా కేవలం చెత్త ఫొటోలను మాత్రమే ప్రచురించింది: ట్రంప్‌

  • ఇటీవల వైరల్‌ అయిన ట్రంప్‌ ఫొటో
  • ట్రంప్‌ చేతులు కట్టుకుని ఉన్నారని జోకులు
  • మీడియాలోనూ చూపించిన వైనం
ఈ ఫేక్‌ మీడియా కేవలం చెత్త ఫొటోలను మాత్రమే ప్రచురించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. ఇటీవల జరిగిన జీ7 దేశాల సదస్సు సందర్భంగా ట్రంప్‌ కుర్చీలో కూర్చొని చేతులు కట్టుకున్నట్లు ఓ ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. ట్రంప్‌తో ఆయా దేశాల అగ్రనేతల మధ్య భేదాభిప్రాయలు వచ్చాయని మీడియా పేర్కొంది.

ఆ ఫొటో ఫేక్‌ అని తెలుపుతూ ట్రంప్ అసలైన ఫొటోలను పోస్ట్ చేశారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, అమెరికా అధ్యక్షులెవరూ ఇదివరకు అడగని విషయాలను తాను అడిగానని, దాని గురించే తమ మధ్య చర్చ జరిగిందని అన్నారు. తాను ఇతర నేతల నిర్ణయాలతో ఏకీభవించలేదని ఫేక్‌ మీడియా పేర్కొందని విమర్శించారు.
Twitter
Donald Trump

More Telugu News