rain: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. ఉత్తర బీహార్‌ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్‌, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గ‌ఢ్‌ మీదుగా సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, రాగల మూడు రోజులలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కోస్తాంధ్రలో, ఎల్లుండి రాయలసీమలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది.
Go Back to Shorts
rain
Andhra Pradesh
Telangana

More Telugu News