25 మిలియన్ల మెక్సికన్లను మీ దేశానికి పంపిస్తాను జాగ్రత్త!: జపాన్ ప్రధానికి ట్రంప్ బెదిరింపు
- ఇటీవల జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన ట్రంప్
- జపాన్ ప్రధాని షింజో అబేకు హెచ్చరిక
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కూడా ట్రంప్ ఫైర్
ఈ సందర్భంగా యూరప్‌కు వలస అనేది పెద్ద సమస్యగా మారిందని ట్రంప్ అన్నారు. అనంతరం షింజో అబేను ఉద్దేశించి మాట్లాడుతూ, జపాన్‌కి ఇలాంటి సమస్య లేదని, కానీ తాను 25 మిలియన్ల మెక్సికన్లను పంపిస్తానని, దీంతో ఆయన పదవి నుంచి దిగిపోతారని ట్రంప్ అనడంతో ఆ సమావేశంలో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఆ తరువాత వలసలపై చర్చలు ఆపేసి, ఉగ్రవాదం అంశంపై చర్చలు జరిపారు.