'ముఠామేస్త్రి' లాంచ్ రోజున రోజా భయంతో వణికిపోయింది: పరుచూరి గోపాలకృష్ణ
- రోజా చేసిన 'సర్పయాగం' హిట్ అయింది
- 'ముఠామేస్త్రి'లో చిరూ జోడీగా ఛాన్స్ వచ్చింది
- ఆ మూవీ లాంచ్ రోజు నాకు బాగా గుర్తు
"రోజా టాలెంట్ చూసి 'ముఠామేస్త్రి' సినిమాలో చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. నాకు బాగా గుర్తు .. 'ముఠామేస్త్రి' సినిమా లాంచ్ రోజున హీరోగారి పక్కన కాకుండా రోజా నా పక్కన నిలబడింది. ఆమె నా చేయిని గట్టిగా పట్టుకుంది .. గజగజ వణికిపోతోంది. 'హీరోయిన్ నా పక్కన కదా నుంచోవాలి' అని చిరంజీవి నవ్వుతూ అన్నారు. 'సార్ నా పక్కన నుంచునే వణికిపోతోంది .. మీ పక్కన నుంచుంటే ఇంకేమైనా ఉందా?' అని నేను అన్నాను. అలాంటి రోజాయేనా ఈ రోజున ఇంత దైర్యంగా మాట్లాడుతున్నది అనిపిస్తూ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.