Jagan: అతిరాస కులస్తులతో జగన్ ఆత్మీయ సమ్మేళనం

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 186వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నందమూరులో ఈరోజు ఆయన అతిరాస కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దివంగత రాజశేఖరరెడ్డే తమను బీసీల్లోకి చేర్చారని ఈ సందర్భంగా అతిరాస కులస్తులు చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే అతిరాస కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి, వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని చెప్పారు. జగన్ పాదయాత్ర రేపు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. 
Go Back to Shorts
Jagan
ysrcp

More Telugu News