ఆయనకు బౌలింగ్ చేయలేకపోవడం నా దురదృష్టం: స్పిన్నర్ రషీద్ ఖాన్
- సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల
- అలాంటి ఆటగాడికి నేను బౌలింగ్ చేయలేకపోయా
- కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్ మెన్ అని, కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తానని చెప్పాడు. అయితే, ఓ అంసతృప్తి మాత్రం తనలో ఉండిపోయిందని చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల అని, అలాంటి ఆటగాడికి తాను బౌలింగ్ చేయలేకపోవడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని, మళ్లీ అలాంటి ఆటగాడు క్రికెట్ లోకి వస్తాడని తాను అనుకోవట్లేదని అన్నాడు.