sandeep kishan: హారర్ నేపథ్యంలో యంగ్ హీరో మూవీ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో సందీప్ కిషన్ వైవిధ్యభరితమైన కథా చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయన నటనకి మంచి మార్కులు పడుతున్నాయిగానీ, హిట్లు పడటం లేదు. దాంతో ఆయన కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ కారణంగానే ఆయన కొంత సమయం తీసుకుని ఒక విభిన్నమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హారర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఇంతవరకూ ఈ తరహా కథలో .. ఇలాంటి పాత్రను చేయని కారణంగా వెంటనే ఆయన ఓకే చెప్పేశాడట. "ఈ సినిమాకి కార్తీక్ దర్శకుడిగా వ్యవహరిస్తాడు .. కథ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది .. బాలీవుడ్ నటి అన్య సింగ్ ఈ సినిమాలో నా జోడీగా నటిస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది .. రెండు భాషల్లోను హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని సందీప్ కిషన్ చెప్పాడు.     
Go Back to Shorts
sandeep kishan
anya singh

More Telugu News