కర్ణాటకలో ఏం జరిగిందో ఆంధ్రాలో కూడా అదే జరగబోతోంది!: బీజేపీ నేత మురళీధర్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటకలో ఏం జరిగిందో ఆంధ్రాలో కూడా అదే జరగబోతోంది!: బీజేపీ నేత మురళీధర్ రావు

  • కుటుంబ రాజకీయం చేసే పార్టీలు ఓబీసీలకు న్యాయం చేయలేవు
  • టీడీపీ, టీఆర్ఎస్ ప్రాణాలు ‘కాంగ్రెస్’ లో ఉన్నాయి
  • ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని కాంగ్రెస్ లో కలిసిపోయే పార్టీ టీడీపీ
కర్ణాటకలో ఏం జరిగిందో ఆంధ్రాలో కూడా అదే జరగబోతోందని, కుటుంబ రాజకీయం చేసే పార్టీలు ఓబీసీలకు న్యాయం చేయలేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ లో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటకలో బీజేపీకి తెలుగు వాళ్ల సత్తా చూపించారని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బాలనాగమ్మ నాటకంలో మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టుగా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల ప్రాణాలు ‘కాంగ్రెస్’ లో ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని కాంగ్రెస్ లో కలిసిపోయే పార్టీ టీడీపీ అని, మజ్లిస్ కు సాష్టాంగ నమస్కారం చేసే పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు.
bjp
muralidhar rao

More Telugu News