Jagan: జగన్, పవన్ లకు గట్స్ ఉంటే కేంద్రాన్ని నిలదీయాలి!: మంత్రి సోమిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విజయవాడలో జరుగుతున్న రెండో రోజు మహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వంపై, టీడీపీ నేతలపై జగన్, పవన్ కల్యాణ్ లు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్, పవన్ కు గట్స్ ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. తనపై దాడులు చేసే ప్రయత్నాల్లో టీడీపీ నేతలు ఉన్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సోమిరెడ్డి ఖండించారు. పవన్ పై దాడులు చేసేంత ఖాళీ సమయం తమకు లేదని, అసలు, పవన్ ఎక్కడుంటారో, ఏ గుళ్ల వెంట తిరుగుతారో, ఏ గుహల్లోకి వెళ్తారో చూసే తీరికే తమకు లేదని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Jagan
Pawan Kalyan
somireddy

More Telugu News