మిమ్మల్ని సీఎం అనాలా? బావగారూ అని పిలవాలా?: చంద్రబాబు ఎదుట సావిత్రి కూతురు చాముండేశ్వరి
- చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ‘అక్కా’ అని పిలుస్తా
- అందుకే, బాబును ‘సీఎం’ అనాలా? ‘బావగారూ’ అనాలా? అనే డౌట్
- ‘మహానటి’ చిత్ర యూనిట్ ని సన్మానించిన సీఎం
- సన్మానంపై సంతోషం వ్యక్తం చేసిన చాముండేశ్వరి
తనకు సన్మానం అనంతరం సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం అనాలా? లేక బావగారు అని పిలివాలో’ తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ‘అక్కా’ అని పిలిచే దానినని చెప్పారు. చిత్రయూనిట్ ని సన్మానించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ చాలా బాగా చేసిందని, తన తల్లిని చూడాలనిపిస్తే కీర్తి సురేశ్ నే చూస్తానని చాముండేశ్వరి చెప్పారు.