Nara Lokesh: డియర్ ఎ1.. ‘ఆపరేషన్ కొల్లేరు’ గుర్తుందా? లేక గజినీగా మారారా?: జగన్ పై లోకేష్ మండిపాటు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘డియర్ ఎ1, ‘ఆపరేషన్ కొల్లేరు’ గుర్తుందా? లేక మీరు గజినీగా మారారా? మీకు నన్ను గుర్తుచేయనివ్వండి. గతాన్ని గుర్తుచేసుకుంటే.. కొల్లేరు సరస్సుకు చెందిన 30 వేల ఎకరాలను నాశనం చేయించేందుకు మీ నాన్న ప్రొక్లెయినర్స్ పంపి.. బాంబులు పేల్చి 25 వేల మంది మత్స్యకారుల జీవితాలను నాశనం చేశారు. ఈ కారణం చేత కాదా, ఆ కమ్యూనిటి టీడీపీకి మద్దతిస్తోంది? కొల్లేరు సరస్సుకు సంబంధించి మళ్లీ రీ సర్వే చేయిస్తామంటూ అబద్ధాలు చెబుతున్నారు. ఓట్ల కోసం మత్స్యకారులపై కృత్రిమ ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రలోభాలకు మత్స్యకారులు గురికారు’ అని లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan

More Telugu News