అందువల్లే ప్రాణాలతో బతికి బయటపడ్డాను: ఏలూరు ఎంపీ మాగంటి బాబు
- టెలీ మెడిసిన్ ద్వారా సిబ్బంది సలహాలు తీసుకున్నారు
- అంబులెన్స్ లో ప్రథమ చికిత్స వల్లే ప్రాణాలు దక్కాయి
- నేడు డిశ్చార్జ్ అవుతున్నానన్న మాగంటి బాబు
నేడు మాగంటి బాబును డిశ్చార్జ్ చేయనుండగా, ఇదే విషయాన్ని తనను కలిసిన విలేకరులకు ఆయన చెప్పారు. అంబులెన్స్ లోనే వైద్యుల సలహా మేరకు ఈసీజీ నిర్వహించి, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబుకు సెల్ ఫోన్ ద్వారా రిపోర్టుల గురించి చెప్పారని, ఆయన సలహాలు, సూచనలను అంబులెన్స్ సిబ్బంది పాటిస్తూ, ఫస్ట్ ఎయిడ్ అందించడం వల్లే సురక్షితంగా విజయవాడకు చేరుకున్నానని తెలిపారు.