చైనాలో విడుదలైన తొలిరోజే ‘దంగల్‌’ సినిమా రికార్డును బద్దలుకొట్టిన ‘బాహుబలి-2’
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలో విడుదలైన తొలిరోజే ‘దంగల్‌’ సినిమా రికార్డును బద్దలుకొట్టిన ‘బాహుబలి-2’

  • 'బాహుబలి-2'కి తొలి రోజే 2.85 మిలియన్‌ డాలర్లు
  • గతంలో 'దంగల్‌'కి 2.49మిలియన్‌ డాలర్లు
  • ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాకు 6.74 మిలియన్‌ డాలర్లు
భారతీయ సినీ చరిత్రలో రికార్డుల సునామీ సృష్టించిన ‘బాహుబలి-2’ సినిమాను ఇటీవల చైనాలోనూ విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజే 2.85 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.19కోట్లు) వసూలు చేసి ఆమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ సినిమా ( 2.49మిలియన్‌ డాలర్ల ఓపెనింగ్‌) రికార్డులను బద్దలు కొట్టిందని సినీ విశ్లేషకులు చెప్పారు.

ఆ దేశంలో భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన భారతీయ సినిమాల్లో ‘బాహుబలి 2’ మూడవ స్థానంలో ఉందని అన్నారు. ఇక మొదటి స్థానంలో ఆమీర్‌ ఖాన్‌ నటించిన మరో సినిమా ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ (6.74 మిలియన్‌ డాలర్లు) నిలవగా, రెండో స్థానంలో ‘హిందీ మీడియం’ సినిమా (3.39మిలియన్‌ డాలర్లు) ఉంది. ‘బాహుబలి2’ చైనాలో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ‘బాహుబలి-2’ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే. 
bahubali
dagal
Prabhas
Rajamouli

More Telugu News