హిందీ హిట్ మూవీ రీమేక్ కి 'అ!' దర్శకుడి గ్రీన్ సిగ్నల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ హిట్ మూవీ రీమేక్ కి 'అ!' దర్శకుడి గ్రీన్ సిగ్నల్?

  • హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్'
  • దక్షిణాది భాషల్లోకి రీమేక్
  • తెలుగులో నాయికగా తమన్నా
హిందీలో కొంతకాలం క్రితం కంగనా రనౌత్ చేసిన 'క్వీన్' మూవీ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఆమెకి తిరుగులేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఒక్క తెలుగులో మినహా మిగతా భాషల్లో షూటింగు జరిగిపోతూనే వుంది. తెలుగులో కథానాయిక అయిన తమన్నా రెడీగా ఉన్నప్పటికీ, ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లు మారిన కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైంది.

తాజాగా నిర్మాతలు ఈ ప్రాజెక్టును తీసుకెళ్లి 'అ!' చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారట. 'అ!' వంటి విభిన్నమైన చిత్రంతో ఆయన అందరి మనసులను దోచుకున్నాడు. తన కథలను మాత్రమే తాను డైరెక్ట్ చేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. మరి అలాంటి ప్రశాంత్ వర్మ ఈ రీమేక్ చేయడానికి అంగీకరించాడనేది ఎంతవరకూ నిజమో చూడాలి.  
tamannah

More Telugu News